దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన దుర్గామాత పూజ లో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. త్రినేత్ర యూత్ సభ్యులు, గ్రామస్థులు ఆహ్వానం మేరకు ఆయన గ్రామానికి వచ్చి పూజలో పాల్గొన్నారు. స్థానిక త్రినేత్ర యూత్ సభ్యులు , గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గామాత పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఆయన్ను త్రినేత్ర యూత్ సభ్యులు, గ్రామస్తులు పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బీ.శ్రీను, వీడిసీ అధ్యక్షుడు లింగన్న, గడోళ్ల నరేష్, భోజన్న, జయందర్, గణేష్, మహేష్, సంతోష్, శ్రీకాంత్, అచ్యుత్, సతీష్, నవీన్, సోను తధితరులు పాల్గొన్నారు.
