బాసర ఆలయానికి పోటెత్తిన భక్త జనం
* ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం బాసర ఆలయానికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. సరస్వతీ దేవి స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. సుమారు రెండు గంటల సమయం వేచి ఉండాల్సి వచ్చింది.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీదేవి, ఎస్సై శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

