తనిఖీల్లో పట్టుబడి బైండోవర్ అయిన మద్యం బాటిళ్లు ధ్వంసం
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఎక్సైజ్ శాఖ, బోథ్ పోలీసుల ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువ గల మద్యం బాటిళ్లను గురువారం రాత్రిధ్వంసం చేశారు. ఇటీవల ధన్నూర్, కౌట, మర్లపెల్లి గ్రామాలలో తనిఖీల్లో పట్టుబడ్డ మద్యం బాటిళ్లను స్టేషన్ ఆవరణలో జేసీబీతో గుంత తవ్వి అందులో వేసి నిబంధనల మేరకు ధ్వంసం చేసినట్లు ఎస్సై శ్రీసాయికుమార్ తెలిపారు.
