నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రొగ్రాం:ముథోల్ సీఐ మల్లేష్
*జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శారద నగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సుమారు 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. జిల్లా SP జానకి షర్మిల, ASP అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు ముథోల్ సర్కిల్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్ ల నుంచి 45 మంది కార్డన్ సర్చ్ లో పాల్గొన్నారు. సీఐ మల్లేష్ మాట్లాడుతూ..నేరాల నియంత్రణకే కమ్యూనిటీ ప్రొగ్రాం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. తక్కువ ధరకు వచ్చే వాహనాలను ఎవరూ కొనుగోలు చేయవద్దని, ఇవి దొంగతనం చేసినవని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి వాహనాలతో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. బాసర, తానూర్, ముథోల్, లోకేశ్వరం ఎస్సై లు శ్రీనివాస్, హన్మాండ్లు, బిట్ల పెర్సిస్, అశోక్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

