కూష్మాండ మాత అలంకారంలో బాసర సరస్వతీ అమ్మవారు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదియ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతి అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం నాలుగో రోజు సరస్వతి అమ్మవారు భక్తులకు కూష్మాండ మాత అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించారు. భక్తులు పాటించవలసిన పూజ నియమాలను సూర్యుడికి అర్ఘ్యం అర్పిస్తే వ్యాధులు, దోషాలు మరియు దారిద్య్రం తొలగిపోతాయని ఆలయ అర్చకులు బాలకృష్ణ తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా వస్తున్నారు. పవిత్రమైన గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటున్నారు ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
