ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లె నారాయణ్ రావు పటేల్
చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా భైంసా డివిషన్ లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నదులు, వాగులపై ఉన్న లోతట్టు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భోస్లె నారాయణ్ రావు పటేల్ సూచించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు.

