ఘనంగా బతుకమ్మ సంబరాలు
చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల traditions కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వీధుల్లో సందడి చేసే ఈ పూల పండగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ భైంసా మండలంలోని వాలేగాం గ్రామంలో ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ పండుగను ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దలు పాల్గొని నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా పూజించారు. తంగేడు, గునుగు వంటి పూలతో నాలుగంతరాల బతుకమ్మను అందంగా పేర్చారు. పీఠంపై గౌరమ్మను నిలిపి పూజించారు. నానబియ్యం నైవేద్యం బతుకమ్మకు సమర్పించారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు తల్లి బతుకమ్మ ఉయ్యాలో ” అంటూ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

