చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అధికారులు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TGB RO అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ PMSBY, PMJJBY, అటల్ పెన్షన్ యోజన కలిగి ఉండాలని వివరించారు. ఆడ బిడ్డలకు సుకన్య సమృద్ది యోజన చేసుకోవాలని సూచించారు. బ్యాంకులో తీసుకొన్న లోన్స్ సకాలంలో కట్టుకోవాలని, సైబర్ క్రైమ్ గురించి కళా ప్రదర్శన ద్వారా అందరికీ స్వచ్ఛత గురించి, చెట్ల యొక్క ఉపయోగాలు, ప్రాధాన్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో TGB చప్రాల బ్రాంచ్ మేనేజర్ M.శివకుమార్ ,క్యాషియర్ ప్రభాకర్, SERP APM, CC, VOA మంజుశ, బేల CFL కౌన్సిలర్స్ అజయ్, అనికేత్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

