బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శ
చిత్రం న్యూస్,నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు అనిల్ యాదవ్ తండ్రి శంకర్ యాదవ్ అనారోగ్యంతో గత కొన్నిరోజులుగా నిర్మల్ లో గల ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటావని అధైర్యపడద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిత్య హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడారు. శంకర్ యాదవ్ అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వీరి వెంట నాయకులు తదితరులు ఉన్నారు.
