అడిగిన వారంలో రోజుల్లో షెడ్ వేయించిన ఆడే గజేందర్
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ మందిరం వద్ద షెడ్ ను కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ మంగళవారం ప్రారంభించారు. గత వారం రోజుల ముందు బుద్ధికొండ గ్రామస్తులు, యువకులు అందరూ కలిసి నూతన హనుమాన్ మందిర్ వద్ద రేకుల షెడ్డు అవసరం ఉందని ఆడే గజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. అడిగిన వారం రోజుల్లోనే షెడ్ నిర్మించిన ఆడే గజేందర్ కి గ్రామస్తులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్, ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దుర్కి మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

