బ్రహ్మచారిణీ అవతారంలో బాసర అమ్మవారు
బ్రహ్మచారిణీ అవతారంలో బాసర అమ్మవారు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుడి చేతిలో జప మాల,ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి. అమ్మ నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుందని భక్తుల ప్రతీతి. ఆలయ వేద పండితులు అర్చకులు అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజ నిర్వహించి నైవేద్యంగా పులిహోరను సమర్పించారు. ఆలయ అధికారులు...