ముథోల్‌లో గుంతలమయంగా రహదారి
*ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు
చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు రహదారి గుంతలమయంగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డంతా భారీ గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలు వెళ్లేటప్పుడు నీళ్లు ఎగసి పక్కన నడుస్తున్న వారిపై పడుతున్నాయి. గతంలో తాత్కాలికంగా చేసిన మరమ్మతులు వర్షాలకు కొద్ది రోజుల్లోనే ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాకపోకలు కష్టసాధ్యంగా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా పూడ్చివేసే పనులు కాకుండా, శాశ్వతంగా కొత్త రహదారి వేయాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

