బోరంచు శ్రీకాంత్ రెడ్డి పరామర్శ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన బొడ్డు నవీన్ (మండల కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి) మామ సంటి నర్సింలు ప్రమాదానికి గురైన విషయాన్ని నవీన్ ద్వారా తెలుసుకున్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. రిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన రిమ్స్ డైరెక్టర్, వైద్యాధికారులతో మాట్లాడి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. శ్రీకాంత్ రెడ్డి వెంట మావల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
