తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన సామ రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక,పాడి పరిశ్రమల అభివృద్ధి, మత్స శాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం హైదారాబాద్ లోని అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉన్నా సిబ్బంది లేక ఎందరో మంది క్రీడాకారులు ప్రతిభ ఉన్న ముందుకు వెళ్ళలేకపోతున్నారని ఆయనకు తెలిపారు. ఆదివాసీల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆటల పోటీల్లో ముందుండే యువకులు ఉన్నా కోచ్ లు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆయనకు తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ ని నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు ఉందని, ఇంటర్మీడియట్ వరకు పెంచాలని ఆయన్ను కోరారు. అదేవిధంగా క్రికెట్ ఆడడానికి స్టేడియం కూడా నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
