రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
చిత్రం న్యూస్, బజార్ హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా మండలంలోని గిర్నూర్ గ్రామములో రాజరాజేశ్వర విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. బతుకమ్మ సంబరాలు అనగానే గుర్తుకు వచ్చేది గౌరమ్మ పూజ. అలాంటి గౌరమ్మకి పూజా చేసి విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సామల స్వర్ణలత మాట్లాడుతూ..బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ పండగకి ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుండి పుట్టింటికి చేరుకొని పువ్వుల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న నీటి కుంటలలో నిమజ్జనం చేస్తారని విద్యార్థులకి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఆధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
