ప్రైవేట్ బస్సు బోల్తా
*బెంగుళూరు నుండి నేపాల్ కు పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం సాకేరా గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. బెంగుళూరు నుండి నేపాల్ కు పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. పక్కనే ఉన్న నాలుగు వరుసల జాతీయ రహదారి కాకుండా చిన్న రహదారిగుండా ట్రావెల్స్ బస్సు ప్రయాణించడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. RTO తనిఖీ కేంద్రాలు, స్టేట్ పర్మిట్ లు తప్పించేందుకు ట్రావెల్స్ సంస్థలు చిన్న దారులను ఎంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
