కీర్గుల్ (కే) లో తొలిసారిగా దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలో కీర్గుల్ (కే) గ్రామంలో తొలిసారిగా వీడిసి ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అమ్మవారికి అంగరంగ వైభవంగా సోమవారం రోజు శ్రీ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవి దర్శనమిచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, కట్టె పొంగలి సమర్పించారు. అనంతరం తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. భక్తులు దుర్గా మాతమాల ధారణ గావించారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

