బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, విద్యార్థిని, విద్యార్థులకు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగులందరి సమక్షంలో RGUKT, బాసర కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో ఉపకులపతి ఆచార్య ఎ.గోవర్థన్, కల్చరల్ కమిటీ కన్వీనర్ డా.కె.రాములు, అసోషియేట్ డీన్ ఆఫ్ ఇంజనీరింగ్, అసోషియేట్ డీన్ ఆఫ్ సైన్స్ & హుమానిటీస్, ఆల్ HoD లు, కల్చరల్ కమిటీ డ్యాన్స్ క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ సిరసాని పవన్ కుమార్, కల్చరల్ కమిటీ సభ్యులు, టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులందరూ పాల్గొన్నారు. ఉపకులపతి ఆచార్య ఎ.గోవర్థన్ మాట్లాడుతూ.. బతుకమ్మను మనం ఏవిధంగా అందంగా పేర్చుతామో విద్యార్థులు తమ జీవితాలను కూడా అంత అందంగా నిర్మించుకోవాలని చెబుతూ.. తెలంగాణ సంప్రదాయాలలో శిఖరప్రాయమైనది బతుకమ్మ పండుగ అని సందేశమిచ్చారు. బతుకమ్మ తయారు చేసిన అధ్యాపకులకు, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కల్చరల్ డ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల బతుకమ్మ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

