మా గోస ఎవరూ పట్టించుకోరా?
*15 రోజుల నుంచి బాసరకు రాకపోకలు బంద్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఆయా గ్రామాలు ఓని, కీర్గుల్ (కె), కౌఠ, సాలాపూర్ గ్రామస్థుల గోస అంతా ఇంతా కాదు. ఈ గ్రామాల ప్రజలకు బాసరకు రాకపోకలు పదిహేను రోజుల నుండి నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ఓని నుంచి బాసర వెళ్లే రహదారి మధ్యలో వంతెన ఉండటంతో వంతెన పైనుండి వరద ఉధృతంగా ప్రవహించడంతో పదిహేను రోజుల నుండి ఆయా గ్రామ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, ఎస్బీఐ బ్యాంకు, రైల్వే స్టేషన్, ఆర్జేయూకేటీ, రెవెన్యూ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కు రావాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి లో లెవల్ వంతెన ఉందని అధికారులకు చెప్పిన ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు

