కీర్గుల్ (కె)లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
కీర్గుల్ (కె)లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ పాటలతో, మహిళలు డీజే చప్పుళ్ల నడుమ హోరెత్తిస్తూ నృత్యాలు చేస్తూ సోమవారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ, తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు గొప్పతనాన్ని తెలియజేస్తూ, ప్రకృతిలో సూర్య చంద్రులను కొలిచిన విధంగా వివిధ రకాల పూలను కొలిచే పండుగ మన రాష్ట్రంలో కొనసాగుతోంది. తీరొక్కరంగుల...