బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి భూక్య జాన్సన్ నాయక్
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత చిట్టెటి ముత్తన్న సోదరి గంగవ్వ ఇటీవల మరణించారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి భూక్య జాన్సన్ నాయక్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కత్తెరపాక రాజశేఖర్ ఇటీవల ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి కాలు ఫ్యాక్చర్ కావడంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని ఆయన్ను కూడా పరామర్శించారు. ఆర్థిక సాయం అందజేశారు.
