ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో సోమవారం బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తీరొక రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి తయారు చేసి, బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ డీజే పాటలతో హోరెత్తిస్తూ మహిళల నృత్యాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ సంబరాలు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కోలాటాలు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు.

