బాసరలో ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసరలో ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు *తొలి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రులు ఉత్సవాలు సోమవారం అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక మండపంలో అమ్మవారు మొదటిరోజు శైల పుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించడంతో ఆమెకు శైలపుత్రి...