ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి
చిత్రం న్యూస్, బోథ్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆసాల సదాశివ్ అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూర్ (బీ)లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు కొండ ఎర్రన్న, శ్రీరామ్, శంకర్, రాజేశ్వర్, గణేష్ , రవీందర్, సాయికిరణ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నారాయణరెడ్డి, గంగయ్య, భోజన్న, లక్ష్మణ్, కుల బాంధవులు పాల్గొన్నారు.
