కిర్గుల్ (కె) పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కిర్గుల్ (కె) ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగా బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన విద్యార్థులు పూజలు చేసి చుట్టూ చేరి వర్షాన్ని సైతం లెక్క చేయక బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవళిక మాట్లాడుతూ.. గౌరమ్మకు ప్రతిరూపమైన బతుకమ్మ పువ్వులలోని పరిమళాన్ని, వివిధ రంగులను మన జీవితంలో కూడా తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవళిక, ఉపాధ్యాయురాలు భవాని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

