ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన బోలేరో వాహనం
చిత్రం న్యూస్,ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల శివారులో నిర్మల్ వెళ్ళే బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బోలేరో వాహనం ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూరు నుండి బోథ్ ఎక్స్ రోడ్ పోచ్చెర క్రాస్ రోడ్ నుండి కిన్వట్ వెళ్ళే టీజీ01జడ్ 0011 బస్ ను వెనుక నుండి బోలేరో వాహనం ఢీ కొట్టింది. దీంతో బోలేరో వాహనంలో ఉన్న 10 పశువుల్లో ఒక పశువు మృతి చెందింది. మూడు పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పశువులకు చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పోలీసులు నంబర్ ప్లేట్ ప్రకారం మహారాష్ట్ర కు చెందిన వాహనంగా గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్ కు గాయాలు కాగా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం వేరే బస్ ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాద ఘటన స్థలం నుండి బోలేరో పికప్ వాహన డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

