Chitram news
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 3:18 pm Editor : Chitram news

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి

ఆధార్ సెంటర్ ప్రారంభించాలి
చిత్రం న్యూస్, నేరడిగొండ:
నేరడిగొండ మండలంలో గత కొన్ని నెలలుగా మూతపడి ఉన్న ఆధార్ సెంటర్ ను పునః ప్రారంభించాలని నేరడిగొండ మండల యువకులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండీ కలీంకు బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆధార్ కార్డులో ఉన్న తప్పులు సరిచేసుకోవాలన్న, కార్డు అప్డేట్ చేసుకోవాలన్న, కొత్తగా పెళ్లైన వారి ఆధార్ కార్డు బదిలీ చేసుకోవాలన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళాలి. గత కొన్ని నెలలుగా ఆధార్ సెంటర్ మూతపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు నమోదు చేసుకోవాలన్నా ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనీ, ఇచ్చోడ ఆధార్ సెంటర్ ఇటీవల తిరిగి ప్రారంభమైనా నేరడిగొండ ఆధార్ సెంటర్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో  తహసీల్దార్ ను కలిసి విన్నవించామన్నారు. మండల జనాభా ప్రాతిపదికన ప్రజల సౌలభ్యం కోసం మరో ఆధార్ సెంటర్, మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సాబ్లే సంతోష్, సింగ్, రాథోడ్ రాజశేఖర్, ఏలేటి మనోజ్ రెడ్డి, బొంతుకుల శ్రీను, కుంచపు గోవింద్, బాక్రే ప్రశాంత్, సురేష్, తగిరే చందర్ సింగ్ తదితరులు ఉన్నారు.