రక్తదానం చేసిన విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు
చిత్రం న్యూస్,కాకినాడ: శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రూరల్ మాజీ అధ్యక్షులు, విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు బుధవారం కాకినాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా సేవ పక్వాడ అభియాన్ కార్యక్రమం రక్తదాన శిబిరంలో పాల్గొని ఆయన రక్త దానం చేశారు. విశ్రాంత ఆర్మీ జవాన్ సురపతి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని మోదీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మీ లో ఉంటూ దేశ ప్రజల కోసం చేసిన సేవను, పడిన శ్రమను, తను పాల్గొన్న కార్గిల్ వార్ లో ఎందరో ప్రాణాలు కోల్పోయిన విషయాలను గుర్తుచేసుకున్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా జరిగే సేవా పక్షోత్సవలో భాగంగా అక్టోబర్ 2 వరకు మెడికల్ క్యాంప్ లు, సెమినార్లు, పలు రకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


మంచి దృక్పథం తో ఆలోచించి రక్తం దానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారికి సరైన సమయంలో ఎంతగానో ఉపయోగ పడుతునందుకు సంతోషంగా ఉంది.