వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం విశ్వకర్మ మరాఠి వడ్రంగి సంఘo ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ గోపాలకృష్ణ మఠంలో విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం పట్టణంలో భారీ శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు. బీసీ సంఘo జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, నేతలు విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వె సంతోష్, ఎం.దిలీప్, నాయకులు, కులస్తులు పాల్గొన్నారు

