Chitram news
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 9:38 am Editor : Chitram news

MINISTER SEETHKKA :ప్రజా భవన్‌లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం

MINISTER SEETHKKA :ప్రజా భవన్‌లో కౌమార బాలికల సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం

చిత్రం న్యూస్, బేగంపేట: హైదరాబాద్‌ బేగంపేటలోని ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ప్రారంభించారు. SERP, మహిళా-శిశు అభివృద్ధి శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో DRDOలు, అదనపు DRDOలు, DWOs కోసం అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల త‌ర‌హాలో కౌమార బాలికా సంఘాల ఏర్పాటు పై దిశా నిర్దేశం చేశారు. Serp సీఈఓ దివ్య దేవ‌రాజ‌న్, అడిషనల్ సీఈఓ కాత్యాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి. సృజన, UNICEF చైల్డ్ ప్రొటెక్షన్, కౌమార & యువజన అభివృద్ధి అధికారి ఎం. మురళీకృష్ణ, తరుణి సంస్థ చైర్ పర్సన్ మమత రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.