నల్ల బ్యాడ్జిలతో నిరసన
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాఠశాల ఆవరణలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఉష్కెలా కార్తీక్, కళాశాల ప్రిన్సిపాల్ రాజా కిరణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శరత్, అధ్యాపకులు ముకుందరావు, లింగన్న, రవి, శేఖర్, సాయికుమార్, అరవింద్ విద్యార్థులు పాల్గొన్నారు.
