ROAD, BRIDGE: రోడ్డు, వంతెన లేక పరుపులపల్లె గ్రామస్తుల కష్టాలు
*ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వంతెన దాటుతున్న విద్యార్థులు, గ్రామస్తు

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని పరుపులపల్లె గ్రామంలో వర్షాకాలం వస్తే ప్రజల కష్టాలు అంతా ఇంతా కావు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి రోడ్డు, వంతెన లేకపోవడంతో ఇబ్బందులు నడుమ వాగు దాటుతూ వెళ్లాల్సివస్తోంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతుంది. వర్షాల సమయంలో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ఆ వాగును దాటి పాఠశాలకు వెళ్ళాల్సి వస్తోంది. రహదారి లేకపోవదంతో వాహన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోతున్నాయి. మా పిల్లలు చదువు కోసం అవస్థలు పడాల్సి వస్తోందని, శాశ్వత రోడ్డు, వంతెన లేకపోతే ఈ ఇబ్బందులు ఎప్పటికీ తగ్గవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని, కనీసం విద్యార్థుల భవిష్యత్తు కోసం అయినా వెంటనే రోడ్డు, వంతెన నిర్మించాలని పరుపులపల్లె గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
