BJP: బీజేపీలో పలువురు చేరిక
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా (కే), దుబ్బాగూడ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే శంకర్ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నాయకత్వాన్ని సమర్థించేలా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ లో చేరుతున్నారని పేర్కొన్నారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించిన మాదిరిగానే రానున్న ఎన్నికల్లో సైతం బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తే గ్రామాల్లో కనీసం బల్బులు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు. అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అస్తక్ సుభాష్, సాత్నాల మండల ఇంఛార్జి రమేష్, పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

