అసత్య ప్రచారాన్ని ఆపాలి
*బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో జరిగిన సంక్షేమ పథకాల చెక్కుల కార్యక్రమంలో బోథ్ రెవిన్యూ డివిజన్ గురించి ప్రస్తావిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలను ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం తగదని, నిజాన్ని ప్రజలకు తెలిపినందుకు ఓర్వలేకనే దుష్ప్రచారానికి తెరలేపారని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. బోథ్ పట్టణంలో చట్ల ఉమేష్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పక్కాగా వెళ్తున్న సందర్భంలో ఓటమి భయంతోనే , రాష్ట్ర మంత్రిపై అసత్య ప్రకటనలను ప్రచారం చేస్తున్నారని వీటిని ప్రజలు నమ్మరని, రాబోయే పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటున్నారని దీమా వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రెవెన్యూ డివిజన్ కోసం మంత్రిపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో బోథ్ రెవెన్యూ డివిజన్ ఉందని ఉద్దేశపూర్వకంగా స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ అబ్రార్, ఆత్మా డైరెక్టర్ గడ్డల నారాయణ, అలాపటి అచ్చుతానంద రెడ్డి, జగన్, కౌసర్, కాయిపల్లి శ్రీనివాస్, ఫెరోజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
