AADE GAJENDER: బాధిత కుటుంబానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ
చిత్రం న్యూస్: ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఏనుగు కృష్ణారెడ్డి కుమారుడు నరసింహా రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శనివారం వారి ఇంటికెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరసింహా రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యవతి కోటేశ్వర్, సీనియర్ నాయకులు ఇచ్చోడ పాక్స్ వైస్ చైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తూరి లక్ష్మణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ జాహిద్ మొహియుద్దీన్, కుర్మే మహేందర్, సీనియర్ నాయకులు మహబూబ్, హుస్సేన్, సాదిక్, బొజ్జా సాయన్న, విఠల్, దేవన్న, రమేష్, గణేష్, యండీ సద్దాం, సయ్యద్ సల్మాన్ తదితరులు ఉన్నారు.

