Adilabad: టైలర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు MLA పాయల్ శంకర్ ను శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కాలనీలో డ్రైనేజి వ్యవస్థ సరిగాలేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని తెలిపారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం వరద నీరుతో నిండిపోతుందని, రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్బంగా MLA పాయల్ శంకర్ మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా సమస్య ను వివరించి పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గేడం మాధవ్, అక్షయ్, దశరథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

