విద్యుత్ సరఫరాలో అంతరాయం
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ మండలాలలో ఈ నెల 13న శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాంసింగ్ తెలిపారు. 33/11KV సబ్ స్టేషన్ ఖానాపూర్, సుర్జాపూర్, పాత ఎల్లాపూర్, సత్తెనపల్లి, బీర్నంది, కడం, లింగాపూర్, బిలాల్ నెలవారి మరమ్మత్తుల కోసం 33 కేవీ కడెం, పెంబి ఫీడర్ పైన చెట్ల కొమ్మలను తొలగించుటకు, విద్యుత్ లైన్లో ఉన్న మరమ్మతులను సరిచేయడం కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ సబ్ స్టేషన్ పరిధిలో వచ్చే గ్రామాలన్నిటికీ విద్యుత్ అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు, రైతులు సహకరరించాలని కోరారు.
