Chitram news
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 12:28 pm Editor : Chitram news

UTF: రణభేరి పోస్టర్ ఆవిష్కరణ

UTF: రణభేరి పోస్టర్ ఆవిష్కరణ

చిత్రం న్యూస్, పెద్దాపురం: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల సాధన, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం(AP UTF) రాష్ట్ర సంఘం ప్రకటించిన దశల వారి కార్యక్రమాల్లో భాగంగా పెద్దాపురం యూటీఎఫ్ పట్టణ శాఖ రణభేరి పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని, 12 వ  పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించి త్వరితగతిన పీఆర్సీను ప్రకటించాలని, పెండింగ్ DA బకాయిలు విడుదల చేయడంతో పాటుగా కొత్త DA ను ప్రకటించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఈనెల 15 నుంచి 19 వరకు బైక్ జాతాలను నిర్వహించి 25వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  యూటీఎఫ్ పట్టణ అధ్యక్షురాలు S.సత్యవేణి ,సహాధ్యక్షులు జీవీవీ సత్యనారాయణ, యూటీఎఫ్ సీనియర్ నాయకులు వెంకట్రావు, ప్రసాద్, శివప్రసాద్ ,ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.