దుబార్ పేట్ లో మెడికల్ హెల్త్ క్యాంప్
పీహెచ్ సీ వైద్యాధికారి డా. కిరణ్ కుమార్
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో శుక్రవారం మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరము పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తపోటు, మధుమేహం ,షుగర్ వ్యాధులను గుర్తించి మందులు అందజేశారు. గర్భిణులు సక్రమంగా మందులు వాడాలని తెలిపారు. ఈ వర్షాకాల నేపథ్యంలో ఇంటి చుట్టూ నీళ్లు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాలను గుర్తించి పారబోశారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా ,చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ బ్రహ్మానంద రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాష్, ఏఎన్ఎంలు సుధారాణి ,పద్మ, వసంత్, సుభాష్ ,ఆశ కార్యకర్తలు , గ్రామస్తులు పాల్గొన్నారు.