Chitram news
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 11:15 am Editor : Chitram news

ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో  పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్సై పురుషోత్తం

చిత్రం న్యూస్: ఇచ్చోడ: తెలంగాణ రాష్ట్ర ఫొటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోషియేషన్ హైదరాబాద్ లో ఈ నెల 19, 20, 21 న నిర్వహిస్తున్న ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఎస్సై పురుషోత్తం  శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై పురుషోత్తం మాట్లాడుతూ.. మారుతున్న కాలాన్ని బట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, మండల అధ్యక్షులు అజయ్ మచ్చ, జిల్లా ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు దోడ అశోక్, ఉపాధ్యక్షులు ముప్కాల ప్రవీణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాపాక విజయ్ కుమార్, మండల ఉపాధ్యాయ ఏరేకర్ దయాకర్, జనరల్ సెక్రటరీ రేలా రమేష్, సెక్రటరీ సుభాష్, మండల ఫోటోగ్రాఫర్స్ వారే రాజు, వంశీకృష్ణ, సతీష్, రాకేష్, విక్రమ్, రాము తదితరులు పాల్గొన్నారు.