Adilabad బోథ్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మోడల్ ఇందిరమ్మ ఇల్లు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, డార్మెటరీ భవనాలను గురువారం ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బోథ్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే ప్రస్తావన ఉంచగా అందుకు మంత్రి స్పందిస్తూ రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు శతవిధాలా ప్రయత్నిస్తాను కాని హామీ ఇవ్వనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బోథ్ నియోజకవర్గంలోని జలపాతాల విషయంలో సైతం తాను సందర్శించిన తరువాతే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
