బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి, మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి మొత్తం 124 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువ నాయకుడు, వ్యూహకర్త అలపాటి అచ్యుతానంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ కౌసర్, షేక్ షబీర్, ఆమెర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ నేతృత్వంలో పార్టీ లోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అంకితభావంతో కృషి చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. పార్టీ విస్తరణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న చట్ల ఉమేష్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కాంగ్రెస్ విచార్ విభాగ్ రాష్ట్ర కన్వీనర్ తుల అరుణ్, మార్కెట్ ఛైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

