భాగవతం రాయడంలో వేద విద్యార్థి ప్రతిభ
చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన నమలికొండ సుజయ్ కుమార్ శర్మ భాగవతాన్ని రాసి ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. ప్రస్తుతం తిరుపతి లోని కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్ వేద పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిదవ తరగతితో పాటు వేద విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో వివిధ విభాగాల్లో పోటీలను ఏర్పాటు చేయగా సుజయ్ భాగవతాన్ని రాసి తన ప్రతిభ కనబర్చారు. ఇందుకుగాను కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్రసరస్వతి చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు రూ.3వేల నగదును అందుకున్నారు. స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ ఘనత పట్ల సుజయ్ తల్లిదండ్రులు శ్రీదేవి, సంతోష్ కుమార్ శర్మలతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ , కరస్పాండెంట్ కృష్ణవేణి, వెంకటసుబ్రమణ్యంలు అభినందించారు. ఆనందం వ్యక్తం చేశారు.

