తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ
చిత్రం న్యూస్, నేరడిగొండ: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిఖార్సుగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. రజక సంఘం సభ్యులతో కలిసి మొక్కను నాటారు.అనంతరం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి రజక సంఘం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ..చాకలి చిట్యాల ఐలమ్మ ఉద్యమాలతో చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందారని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశైలిగా పెరుపొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రజక సంఘం అధ్యక్షుడు నేరెళ్ల శేఖర్, సభ్యులు జంగంపల్లి రమేష్, చిర్ర దశరథ్, మెట్పల్లి గంగయ్య, జంగంపల్లి శ్రీకాంత్, మర్రిపల్లి శ్రీనివాస్, నిమ్మల భూమన్న, సిర్ర అర్జున్, గంగయ్య, గ్రామ పెద్దలు జీవన్ రెడ్డి, పద్మనాభం రెడ్డి, బాడాల శ్రీకాంత్, అజయ్ రెడ్డి, నల్ల లక్ష్మణ్, ప్రదీప్, విద్యాసాగర్ రెడ్డి, శోభన్ రెడ్డి, కుర్మ మల్లేష్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజకుమార్ రెడ్డి, కారోబార్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

