కుమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి “తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్
చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని మారుమూల గ్రామాలైన మహధుగూడ, కేశవ్ గూడ, పార్డి (బి), పార్డి (కే ), ఘన్ పూర్, టివిటి, పరుపులపల్లె గ్రామాలలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొంత నిధులతో.చేపట్టనున్న కుమురం భీం విగ్రహాల నిర్మాణం కోసం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ..కుమురం భీం ఆశయాలను ప్రతి ఆదివాసి గ్రామాలకు చేరాలని, ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి, అందరి ఆరాధ్య దైవమన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున హామీ ఇవ్వడం జరిగిందని, నెల రోజులలో అన్ని గ్రామాల్లో కుమురం భీం విగ్రహాల కోసం భూమిపూజ చేసుకోవడం చాలా సంతోషం అన్నారు. కార్యక్రమంలో పార్డి (బి) రాయి సెంటర్ సర్మేడీ తొడసం లక్ష్మణ్ , ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మెస్రం భూమన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, దేవేందర్, సురేష్, గ్రామ పటేల్ లు సిడం అమృత్ రావ్, కోవ జైత్తు, ఆత్రం, పంద్రం జైతు, మాడావి బాపురావు, పురుషోత్తం, ఆదివాసీ మాజీ సర్పంచులు జమున, మారుతి, కోవ. కిషన్, భగవత్ రావు , నాగేష్, కొడప దేవిదాస్, బీఆర్ఎస్ నాయకులు యార్ల సుధీర్ రెడ్డి, అభిలాష్, చిన్నయ్య, సోమన్న, హరీష్ , సుగుణాకర్ , ప్రమోద్ , షేక్ ఆసిఫ్, గంగమల్లు, గిరిజన మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

