ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంఘాలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో భైంసా కేంద్రంలోని ప్రభుత్వ గోపాల్ రావు పటేల్ డిగ్రీ కళాశాలలో కాళోజీ చిత్రపటానికి ప్రిన్సిపల్ కరోల్ల బుచ్చయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ..ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న...