ఆదిలాబాద్ నియోజకవర్గ గ్రామాల అభివృద్ధికి రూ.13.78 కోట్లు విడుదల
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ గ్రామాల్లోని పలు కాలనీలలో అభివృద్ధి పనుల కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.13.78 కోట్లు నిధులు విడుదల అయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కాలనీలో మురికి కాలువలు ఇతర రోడ్ల అభివృద్ధి కోసం పలు గ్రామాల నుంచి వచ్చిన వినతి మేరకు నిధుల విడుదలకై ప్రతిపాదించగా నియెజకవర్గానికి ఎస్సీ సబ్ ప్లాన్ కింద నిధులు విడుదల కావడంతో అభివృద్ధి పనులకు మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఎస్సీ కులస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

