ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కాలేజీలో కాళోజీ నారాయణ రావు జయంతి పురస్కరించుకుని తెలంగాణ భాష దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.వరప్రసాద రావు మాట్లాడుతూ.. తెలంగాణ యాస, భాష ఒకప్పుడు పూర్తిగా నిర్లక్యానికి గురి చేయబడిందనీ, మన ప్రభుత్వం వచ్చిన తరువాత వరంగల్ లోని ఆరోగ్య విశ్వ విద్యాలయం కు కాళోజీ పేరు పెట్టుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు మన భాష, మన యాసలో మాట్లాడాల్సిన అవసరం ఎంత అయిన ఉందన్నారు. తెలుగు అధ్యాపకులు గెడం సంజీవ్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. గెడం ప్రవీణ్, అడ్మినిస్ట్రేషన్ అధికారి సాగర్, ఐసీసీ చైర్మన్ పుష్ప, ఐసీసీ సభ్యులు ప్రియాంక, సీనియర్ అధ్యాపకులు కిష్టారెడ్డి, ఆమోల్, బిందు, సౌందర్య, విజయ, అనికేత్తదితరులు పాల్గొన్నారు.

