ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన వొర్స రాజేందర్ సేవలకు గాను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్శి షా చేతుల మీదుగా ఇటీవల అందుకున్నారు. వొర్స రాజేందర్ తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. క్రమశిక్షణ విలువలతో విద్యను అందిస్తూ విద్యార్థులకు భవిష్యత్తు పట్ల మార్గ నిర్దేశం చేసినందుకు గాను అవార్డు అందుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రముఖ నిర్మాత, హోమియో వైద్యులు డాక్టర్ రవికిరణ్ యాదవ్ జిల్లా యాదవ సంఘo ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసుర హన్మాండ్లు యాదవ్, మంచాల మల్లయ్య యాదవ్, నర్ర నవీన్ యాదవ్, వేణుగోపాల్ యాదవ్, గొర్ల రాజు యాదవ్, పురుషోత్తం యాదవ్, సల్ల విజయ్ బాబు, నారకట్ల రాములు యాదవ్ తదితరులు ఉన్నారు.

