విద్యుదాఘాతానికి యువకుడు మృతి
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ (Kondukur) గ్రామానికి చెందిన సంఘం రాజేందర్ (37) అనే యువకుడు విద్యుదాఘాతంతో మంగళవారం దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండుకూర్ కు చెందిన సంఘం రాజేందర్ ఉదయం పొద్దుటూరి సంజీవరెడ్డి పొలంలో గడ్డి కోయడానికి వెళ్లాడు. గడ్డి కోసే యంత్రానికి వైర్ తగలడంతో రాజేందర్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. గ్రామంలో కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రాజేందర్ కరెంట్ షాక్‌తో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

